ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు

30-09-2026 | 11:11pm

మొయినాబాద్‌ మున్సిపాలిటీలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, సీనియర్‌ అసిస్టెంట్‌పై కేసు

మొయినాబాద్‌,(విజయక్రాంతి): నిర్మాణంపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.75 వేల లంచం డిమాండ్‌ చేసి స్వీకరిస్తుండగా మొయినాబాద్‌ మున్సిపాలిటీ(Moinabad Municipality) టౌన్‌ ప్లానింగ్‌ అధికారి గుండు వాణి, సీనియర్‌ అసిస్టెంట్‌ యలమోని సుదర్శన్‌ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ ప్రకటన ప్రకారం.. AO-1 సూచన మేరకు AO-2 ద్వారా ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా సిటీ రేంజ్‌-2 ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ నాంపల్లిలోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు పేర్కొంది. ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్‌ చేస్తే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది.

మరిన్ని వార్తలు