ములకలపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య డిమాండ్.
ములకలపల్లి,అక్టోబర్ 9 (విజయక్రాంతి): ములకలపల్లి మండలాన్ని(Mulakalapalli Mandal) రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య(CPM State Committee member Annavarapu Kanakaiah) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రములోని సిపిఎం కార్యాలయంలో(CPM Office) ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని ఎల్ నీనో ప్రభావంతో(Impact of El Nino) ఎడారిగా మారి పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని ఎల్ నీనో ప్రభావంతో నష్ట పోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి రైతులను అదుకోని నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
మోటార్లు ఉన్న ప్రాంతాల్లో నీరు పంటలకు అందక ఎండలకు పంటలు బీడు భూములుగా మారాయని అన్నారు.పత్తిపంట పూత కాయ దశలో నీరు లేక ఎండి పోయి ఎడారిగా మారుతుందని పత్తి పంటను నష్టాన్ని అంచనా వెసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎల్ నీనో ప్రభావంతో కొంతమంది రైతులు వర్షాధారంతో ఆరుతడి పంటలు సాగు చేసిన రైతుల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని పంటలు ఎండిపోయిన ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి నష్ట పోయిన రైతులకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, గౌరీ నాగేశ్వరరావు, నిమ్మల మధు,కుంజా రాంమూర్తి, గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.