బస్వాపూర్ నిర్వాసితులకు అండగా ప్రజా ప్రభుత్వం
లప్ప నాయక్ తండా భూ నిర్వాసితులకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, అక్టోబర్ 9 (విజయక్రాంతి): బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం(Construction of Baswapur Reservoir) కారణంగా భూములు కోల్పోయిన లప్ప నాయక్ తండా భూ నిర్వాసితులకు(Lappa Nayak's horde of landless people) పునరావాసం కల్పించడంలో భాగంగా యాదగిరిగుట్ట మండలం(Yadagirigutta Mandal) దాతర్‌పల్లి గ్రామ సమీపంలో నిర్వహించిన ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో(Distribution of house site pattas programme) ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య(Beerla Ailaiah) మాట్లాడుతూ బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన లప్ప నాయక్ తండా నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సంక్షేమం, పునరావాసానికి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం లో భూములు త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు తగిన న్యాయం చేయడం, వారికి నివాస వసతి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
లప్పనాయక్ తండా వాసులు ఉద్యమిస్తున్న సమయంలో వారికి అన్ని విధాలుగా ఆదుకున్నామని, ఉప ముఖ్యమంత్రి బట్టివిక్రమార్క పాదయాత్ర లో బాగంగా మీకు న్యాయం చేస్తామన్న హామీ మేరకు,నష్టపరిహారం తో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం తీసుకొని ఇందిరమ్మ ఇళ్ల విషయం లో ప్రత్యేక కోట ఇస్తామన్నారు.
భూములు కోల్పోయిన కుటుంబాలు ఆందోళన చెందకుండా, వారికి భరోసా కల్పించి, గౌరవప్రదమైన జీవనం కొనసాగించేందుకు అవసరమైన పునరావాస చర్యలు చేపట్టడం ముఖ్యమని అన్నారు. లప్ప నాయక్ తండా వాసులకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ చేయడం ద్వారా వారు తమ సొంత ఇంటి నిర్మాణానికి ముందడుగు వేసే అవకాశం కలుగుతుందని అన్నారు. రూ.26.50 కోట్లతో పునరావాసం, 250 ప్లాట్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దీరావత్ గాసి రాం నాయక్,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లప్ప నాయక్ తండా గ్రామస్తులు, నిర్వాసిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.