ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు
09-10-2026 | 11:49pm
ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ బొంది రజిని గౌడ్
తూప్రాన్, అక్టోబర్ 9, (విజయ క్రాంతి): తూప్రాన్ మున్సిపల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Toopran Municipal Government Junior College) ముందస్తు బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) కళాశాల నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ ముందస్తు బతుకమ్మ వేడుకలకు తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్(Bondi Rajini Ravinder Goud) పాల్గొని వీక్షించారు. ఇందులో మున్సిపల్ కౌన్సిలర్స్, కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్స్, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.