మూకమామిడిలో నూతన త్రీఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు..

21-10-2026 | 08:39pm

ములకలపల్లి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): మూకమామిడి(Mookamamidi) గ్రామ పంచాయతీలో బుధవారం త్రీఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో మంచినీటి సమస్యకు అంతరాయం ఏర్పడింది. సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మీ వెంటనే మండల విద్యుత్ అధికారి ఏఈ సురేష్ కు సమస్యను తెలియపరచగా ఆయన వెంటనే స్పందించి నూతన ట్రాన్స్‌ఫార్మర్ ను అమర్చారు.

దీంతో మంచినీటి సమస్యకు పూర్తిగా పరిష్కారం లభించింది. ఈ సందర్భంగా సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మీ మాట్లాడుతూ త్రీఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో గ్రామంలో మంచినీటి సరఫరా నిలిచిపోయి, ప్రజలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలపగా మండల విద్యుత్ ఏఈ సురేష్ కు సమస్యను వివరించగా విద్యుత్ ఏఈ సురేష్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి నూతన ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయించి అమర్చారని తెలిపారు.

వెంటనే స్పందించి గ్రామ మంచినీటి సమస్యను తీర్చిన మండల ఏఈ సురేష్, విద్యుత్ శాఖ సిబ్బందికి గ్రామపంచాయతీ తరపున గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. గ్రామ ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  లైన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, పంచాయతీ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు