విఘ్నాలు తొలగించు వినాయకా..
19-09-2026 | 04:53pm
వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన చిలసాని కుటుంబ సభ్యులు.
పినపాక , సెప్టెంబర్ 19, (విజయక్రాంతి): పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ (Janampeta Gram Panchayat) కొత్తగుంపు గ్రామంలోని కోరిన కోరికలు తీర్చే రైతు యువసేన ఆధ్వర్యంలో(Farmer Youth Army) ప్రతిష్ఠించిన వినాయకుడికి చిలసాని కుటుంబ సభ్యులతో కలిసి 5వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని దర్శించుకుని గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, గ్రామంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రజలందరికీ శుభం కలగాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.