విజయలక్ష్మి నగర్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించాలి

24-10-2026 | 10:07pm

ఎల్‌నినో కష్టాలు మొదలయ్యేలోపే నీటి ఇబ్బందులు తీర్చండి

సింగరేణి జీఎంను కోరిన సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): విజయలక్ష్మి నగర్ గ్రామపంచాయతీలో(Vijayalakshmi Nagar Gram Panchayat) తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు సింగరేణి ఇల్లెందు ఏరియా(Singareni Yellandu Area) జీఎంను కోరారు. ఈ మేరకు ఆయన జీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. సింగరేణి సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు సరఫరా(Drinking water supply) చేస్తున్నప్పటికీ, సుమారు 40 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్లు తుప్పుపట్టి దెబ్బతినడంతో నీరు కాలువల్లో వృథాగా పోతోందని తెలిపారు.

గత పది నెలలుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. గతంలో అధికారులు పరిశీలించినా సమస్య పరిష్కారం కాలేదని వివరించారు. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామపంచాయతీలో ప్రత్యామ్నాయంగా బోర్ల ద్వారా నీటిని అందించే అవకాశం కూడా లేదని, దెబ్బతిన్న పాత పైపులైన్ల స్థానంలో కొత్త పైపులైన్లు ఏర్పాటు చేసి తాగునీరు వృథా కాకుండా అరికట్టడంతోపాటు ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందించాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు