పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి!

24-10-2026 | 10:53pm

అర్హులెవరూ అవకాశాన్ని కోల్పోవద్దు

ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.

సత్తుపల్లి. అక్టోబర్ 24. ( విజయ క్రాంతి ) : ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో(Graduates MLC constituency) అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ పేరును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులు విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఓటు ప్రజాస్వామ్యంలో కీలకమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా ఓటు హక్కును పొందేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులు డిగ్రీ మెమో, ఆధార్ కార్డు, ఫొటో, మొబైల్ నంబర్ వివరాలతో ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6, 2026 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అని పేర్కొంటూ, గడువు ముగిసేలోపే అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు.

“అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును పొందాలి. ఒక్కరూ నిర్లక్ష్యం వల్ల అవకాశాన్ని కోల్పోవద్దు.అని ఎమ్మెల్యే దంపతులు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు