కాళోజీ జయంతి వేడుకల్లో సింగరేణి అధికారులు

09-09-2026 | 01:13pm

కొత్తగూడెం సెప్టెంబర్ 9(విజయక్రాంతి): సింగరేణి ప్రధాన కార్యాలయం(Singareni Head Office)లోని హెచ్‌ఆర్‌డి కాన్ఫరెన్స్ హాల్ వద్ధ బుధవారం రోజున ప్రజాకవి,స్వాతంత్ర సమరయోధుడు,తెలంగాణ ఉద్యమకారుడు, పద్మభూషణ్  కాళోజీ నారాయణ రావు  జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్, సి‌ఎస్‌ఆర్ & సెక్యూరిటీ కే.అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి, ముఖ్యఅతిదిగా జి‌ఎం(ఆర్&డి) ఇంచార్జ్ జి‌ఎం(సి‌పి‌పి) సి‌హెచ్.శ్రీనివాస్  హాజరయ్యారు. 

ముందుగా కాళోజీ నారాయణ రావు చిత్ర పటానికి  ముఖ్య అతిది జి‌ఎం(ఆర్&డి)ఇంచార్జ్ జి‌ఎం(సి‌పి‌పి) సి‌హెచ్.శ్రీనివాస్ యూనియన్ నాయకులు,శాఖాధిపతులు, అధికారులు ఉద్యోగులు ఆయనకు ఘనంగా పూలమాలతో మరియు పూలతో నివాళులు అర్పించారు.

అనంతరం ఈ సంధర్భముగా ..జి‌ఎం(ఆర్&డి) ఇంచార్జ్ జి‌ఎం(సి‌పి‌పి) సి‌హెచ్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజా కవి, స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవాలను ఇక్కడ ఇంత ఘనముగా జరుపుకోవటం చాలా సంతోషముగా ఉందని, కార్పొరేట్ లో మాత్రమే కాకుండా సింగరేణి వ్యాప్తముగా కూడా ఈ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. కాళోజీ నారాయణ రావు  స్వాతంత్ర సమరయోధిడిగా  ప్రజా కవి గా తన  కవితల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో ముఖ్య పాత్ర పోషించారని, ఆయన పుట్టినరోజైన సెప్టెంబరు, 09 వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆయన జయంతి వేడుకల ద్వారా ఆయన చేసిన సేవలను ఆశయాలను ముందు తరాలకు తెలియజేయటం ఎంతో ముఖ్యం అని తెలిపారు. 

జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్, సి‌ఎస్‌ఆర్ & సెక్యూరిటీ కే.అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జి‌ఎం(ఆర్&డి) ఇంచార్జ్ జి‌ఎం(సి‌పి‌పి) సి‌హెచ్.శ్రీనివాస్,గుర్తింపు సంఘం (ఏ‌ఐటి ‌యూ‌సి) బ్రాంచ్ సెక్రటరీ ఎస్‌వి.రమణ మూర్తి, ప్రాతినిధ్య సంఘం(ఐ‌ఎన్‌టి‌యూ‌సి) కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ఎస్.పితాంబర రావు, సి‌ఎం‌ఓ‌ఏ‌ఐ ఉపాధ్యక్షుడు కేశవ రావు, జి‌ఎం(ఈ&ఎం) యూ‌జి మైన్స్ కే.యాదయ్య, జి‌ఎం(ఐ&పి‌ఎం) ఎం.వి.నరసింహా రావు, డి‌జి‌ఎం(పర్సనల్) లు బి.శివ కేశవ రావు, ముకుంద సత్యనారాయణ, కార్పోరేట్ లోని వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు