విజయనగరంలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ
విజయనగరం: ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్(Aditya Birla Capital Limited) యొక్క అనుబంధ సంస్థ అయిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఏబిహెచ్ఎఫ్ఎల్), తమ పంపిణీ నెట్‌వర్క్‌ను భారతదేశ వ్యాప్తంగా విస్తరించే విస్తృత ప్రణాళికలో భాగంగా విజయనగరంలో ఒక కొత్త శాఖను ప్రారంభించినట్లు వెల్లడించింది.
ఈ శాఖతో, ఆంధ్రప్రదేశ్‌లో ఏబిహెచ్ఎఫ్ఎల్ యొక్క మొత్తం నెట్‌వర్క్ 16 శాఖలకు పెరిగింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్య , విద్యా కేంద్రంగా విజయనగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. విశాఖపట్నం,చుట్టుపక్కల జిల్లాలతో నగరానికి ఉన్న అనుసంధానం ఈ ప్రాంతంలో మరిన్ని కుటుంబాలను , ఉద్యోగ నిపుణులను సొంత ఇల్లు కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. గృహాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఏబీహెచ్‌ఎఫ్‌ఎల్ యొక్క కొత్త శాఖ, విజయనగరం , సమీప ప్రాంతాలలోని వినియోగదారులకు అనుకూలీకరించిన గృహ రుణ పరిష్కారాలను మరింత అందుబాటులోకి తీసుకువస్తుంది.
ఉద్యోగులు, స్వయం ఉపాధి నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న వృత్తియేతరులు , అభివృద్ధి చెందుతున్న ఆదాయ వర్గాల కోసం నిర్మాణ రుణాలు , ఆస్తిపై రుణాలు వంటి సమగ్ర గృహ రుణ పరిష్కారాలను ఏబీహెచ్‌ఎఫ్‌ఎల్ అందిస్తుంది. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, ఏబీహెచ్‌ఎఫ్‌ఎల్ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17, 2026 వరకు చెల్లుబాటు అయ్యేలా, సున్నా లాగిన్ ఫీజులతో పాటు రూ. 50 లక్షల వరకు స్పాట్ లోన్ మంజూరులను అందిస్తోంది. ఇది ఈ కొత్త శాఖలలో వినియోగదారులకు వేగంగా , మరింత సరసమైన ధరలకు రుణాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది.
ఈ విస్తరణపై ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ & సీఈఓ శ్రీ పంకజ్ గాడ్గిల్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ మాకు ఒక కీలకమైన వృద్ధి మార్కెట్. వినియోగదారులతో సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి మేము మా ప్రాంతీయ కార్యకలాపాలను విస్తరిస్తున్నాము. వినియోగదారులకు గృహ యాజమాన్య ప్రయాణాన్ని సరళంగా, వేగంగా, అవాంతరాలు లేకుండా చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.