ఉద్యోగ విరమణ పొందనున్న జి.ఎం కు ఆత్మీయ సన్మానం

24-09-2026 | 09:47pm

రామగిరి,సెప్టెంబర్24(విజయ క్రాంతి): గురువారం జి.ఎం కార్యాలయంలో(G.M. Office) ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్న కార్పోరేట్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ ఎ.మనోహర్ - సవిత(A. Manohar – General Manager, Corporate Planning and Projects – Savitha) దంపతులను రామగుండం ఆర్ జి-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ - తిరుమల దంపతులు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు - వెంకట లక్ష్మి దంపతులు, ఏరియాలోని వివిధ గనుల, విభాగాధిపతులతో కలిసి ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎ.మనోహర్ సింగరేణి సంస్థలో 38 సంవత్సరాల పాటు వివిధ ఏరియాలలో, వివిధ గనులు, విభాగాలలో, వివిధ హోదాలలో విధేయతతో, అంకితభావంతో అందించిన సేవలు అందరికీ ఆదర్శమన్నారు.పలు సంస్కరణలు చేపట్టి ఉన్నతాధికారుల మన్ననలు పొందారన్నారు.ఉద్యోగ విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో ఎస్వోటుజిఎం యం.రామ్మోహన్, అధికారుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్, ఏరియా ఇంజినీర్లు ఎ.ఉదయ భాస్కర్, ప్రాజెక్ట్ ఆఫీసర్లు ప్రవీణ్ వి ఫ్యాటింగ్, జె. రాజశేఖర్, విభాగాధిపతులు బి.టి.మురళీ కృష్ణ, సి.జె.సురేఖ, బి.సుదర్శనం, రవి కుమార్, జి.లక్ష్మీనారాయణ, అప్సర్ పాషా, కళ్యాణ్ చక్రవర్తి, షబ్బీరుద్దీన్, రాజారవిచరణ్, ఆర్.రాజేశ్వరి, ఆసిఫ్ యాసిన్, మేనేజర్లు రావుల పాపయ్య, భరత్ కుమార్, ఇతర అధికారులు, ఉద్యోగులు  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు