ఎస్‌ఏపీ లెర్నింగ్ హబ్ స్టూడెంట్ ఎడిషన్‌

26-10-2026 | 06:25pm

హైదరాబాద్: చివరి సంవత్సరం విద్యార్థులకు, ప్లేస్‌మెంట్ సీజన్ వచ్చిందంటే విపరీతమైన ఒత్తిడిని ఎదురవుతుంది. ఉద్యోగాలు అందించే సంస్థలు కేవలం డిగ్రీలు సరిపెట్టుకోవడం లేదు. ఆచరణాత్మక నైపుణ్యాలు కూడా ఉండాలని కోరుకుంటున్నాయి. ఎస్‌ఏపీ నైపుణ్యాలు(SAP skills) ఐటీ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా ఫైనాన్స్, హెచ్‌ఆర్, సేల్స్, ప్రొక్యూర్‌మెంట్, మరిన్ని రంగాలలో కెరీర్ అవకాశాలను అందించగలవు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ వైపు ఒక అడుగు.

ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్న ప్రముఖ సంస్థల్లో పనిచేసే అవకాశాన్ని పొందేందుకు కూడా ఇది దోహదపడుతుంది. భారతదేశంలోని అర్హతగల చివరి సంవత్సరం విద్యార్థులు, తమ యూనివర్సిటీ ఈమెయిల్‌ను ఉపయోగించి ఎస్‌ఏపీ యూనివర్సల్ ఐడిని సృష్టించుకుని, ఆ తర్వాత స్టూడెంట్ ఐడి వెరిఫికేషన్ పూర్తిచేసి, ఎస్‌ఏపీ  లెర్నింగ్ హబ్, స్టూడెంట్ ఎడిషన్ కోసం ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.

"విద్యార్థులు వివిధ అంశాలను అన్వేషించి, తమకు ఏది సరిపోతుందో కనుగొనగలగాలని మేము కోరుకుంటున్నాము," అని ఎస్‌ఏపీ లెర్నింగ్ హబ్, స్టూడెంట్ ఎడిషన్ ప్రోగ్రామ్ మేనేజర్ డేవిడ్ చావియానో అన్నారు. విద్యార్థులు నిపుణుల నేతృత్వంలోని సెషన్‌లలో చేరవచ్చు, నిజమైన ఎస్‌ఏపీ ప్రాక్టీస్ సిస్టమ్‌లను ఉపయోగించవచ్చు మరియు అభ్యాసకుల కమ్యూనిటీలో భాగం కావచ్చు.

మరిన్ని వార్తలు