కొమురం భీమ్‌కు ఘన నివాళులు

26-10-2026 | 06:41pm

ఇచ్చోడ,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో కొమురం భీమ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివాసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. స్థానిక కొమురం భీమ్ చౌక్ నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో భాగంగా సిరికొండ చౌరస్తా వద్ద ఉన్న వేడమ రాము చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు.అనంతరం కొమురం భీమ్ చౌరస్తాలోని కొమురం భీమ్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన కొమురం భీమ్ ఆశయాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు సార్మెడీ శంభు, కొడప నాగేష్, కొమురం కోటేశ్వర్, ఆత్రం మహేందర్, సీడామ్ మురళీకృష్ణ, మధు, పెరుమాండ్ల పోశెట్టి, డీవీఎంసీ సభ్యులు రమేష్, సత్యరాజ్, ఇచ్చోడ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొడప జలై జాకు, ఉప సర్పంచ్ లోక శిరీష్ రెడ్డి, పుల్లేడు భీముడు, మల్యాల సర్పంచ్ దేవరావు, గెడం నాగేందర్, నాగరాజ్, కాతలే విట్టల్‌తో పాటు ఆదివాసీ పెద్దలు సుంగన్న, భీమన్న, భీముడు తదితరులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు