సద్దుల బతుకమ్మ వేడుకల్లో విషాదం.. యువతి మృతి
ఆసిఫాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో (Bathukamma Celebrations) విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ ఆడుతున్న సమయంలో చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామానికి చెందిన శ్రీవాణి (25) ఒక్కసారిగా స్పృహతప్పి కిందపడింది. చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా (Software Engineer) పనిచేస్తున్న ఆమె, బూరుగూడలోని తన మేనత్త ఇంటికి వచ్చింది. వేడుకల్లో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి (Government Hospital) తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు స్థానికులు తెలిపారు. యువతి మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి (Tragedy).