నవరాత్రి పూజల్లో మట్టా

19-10-2026 | 10:34am

సత్తుపల్లి, అక్టోబర్ 19 (విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని 16వ, 3వ వార్డుల పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో దసరా నవరాత్రుల (Dasara Navaratri) సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అవణి వెంచర్, అయ్యగారిపేట హనుమాన్ గుడి వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే 16వ, 17వ వార్డుల్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో (Bathukamma Celebrations) పాల్గొని మహిళలకు, ప్రజలకు దసరా, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు (Festival Wishes) తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, కాంగ్రెస్ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు (Party Workers), మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు