చికిత్స పొందుతూ యువకుడి మృతి

08-09-2026 | 01:04am

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తాడువాయి ఎస్సై నరేష్ తెలిపారు. గ్రామానికి చెందిన యువకుడు లింగవ్వొల్ల జీవన్ (30) అనే యువకుడు ఈ నెల 3న ఉదయం బైకుపై తాడువాయలోని ఆయన ఇంటి నుంచి తాడ్వాయిలో ఉన్న గురుకుల పాఠశాలకు(Gurukul School) వెళ్తున్నాడు. చందాపూర్ రోడ్డులో గురుకుల పాఠశాల వైపు మరలుతున్న  సమయంలో చందాపూర్ నుంచి బైక్ పై వస్తున్న బ్రహ్మాజీ వాడికి చెందిన దేవ పల్లి శ్రవణ్ అతివేగంగా జీవన్ బైకును ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో జీవన్ తలకు బలమైన గాయాలు అయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కామారెడ్డిలోని మెడికేర్ ఆసుపత్రి(Medicare hospital)కి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్సల కోసం హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.నిమ్స్ లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యువకులు బైక్ పై వెళ్ళేటప్పుడు అతివేగంగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు