మహాభారతం భీముడిపై కేసు నమోదు!
శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 20(విజయక్రాంతి): పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే ఫిర్యాదుతో నటుడు,అంతర్జాతీయ రెజ్లర్ సౌరవ్ గుర్జార్‌పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ముంబై విమానాశ్రయం ఎగ్జిట్‌లో అతన్ని అదుపులోకి తీసుకుని, శనివారం హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.గచ్చిబౌలిలో నివసిస్తున్న 37 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆగస్టు మధ్యలో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చింది. కర్ణాటకకు చెందిన ఆమెకు 2016లో వివాహం జరిగి, తర్వాత విడాకులు తీసుకున్నారు. 2021లో అమెరికాలో ఉండగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సౌరవ్‌తో పరిచయం ఏర్పడిందని, వాట్సాప్‌లో సంబంధం పెరిగిందని ఫిర్యాదులో పేర్కొంది.డిసెంబర్ 25, 2021న తొలిసారి ప్రత్యక్షంగా కలిశామని చెప్పింది. భార్యకు ఉండే హక్కులన్నీ ఇస్తానని హామీ ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది.
20-09-2026 | 01:45pm