ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి కార్యక్రమం

22-10-2026 | 03:39pm

హనుమకొండ, అక్టోబర్ 22(విజయ క్రాంతి):హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి(Birth Anniversary of Panduga Sayanna Mudiraj) కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి(District Collector Chahat Bajpai),

జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, రాష్ట్ర మేర కార్పొరేషన్ ఛైర్మన్ సంగు వెంకట్రాజం,  ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం నాయకులు  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పండుగ సాయన్న ముదిరాజ్ ధైర్య సాహసాలు, చేసిన సేవలను అధికారులు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సంపూర్ణ, ఇతర అధికారులతో పాటు వివిధ సంఘాల  ప్రతినిధులు దేవేందర్ ముదిరాజ్,కూతురు రాజు, పొన్నం రాజు, పులి రజనీకాంత్, పొన్నం మొగిలి, బండి సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు