జంగంపల్లిలో ఘనంగా అన్నప్రసాద వితరణ

22-10-2026 | 03:32pm

భిక్కనూర్, అక్టోబర్‌ 22 (విజయ క్రాంతి): భిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామంలో దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో 23వ దేవి నవరాత్రి ఉత్సవాల్లో(Devi Navratri festival) భాగంగా అమ్మవారికి సమర్పించిన ఒడిబియ్యంతో అన్నప్రసాదం తయారు చేసి భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఉత్సవాలతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు