గడ్డం మల్లయ్య 9వ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు అన్నదానం...
ఆలేరు, అక్టోబర్ 22 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని(Kolanupaka Village) జైన మందిరం ఆవరణలో కీర్తిశేషులు గడ్డం మల్లయ్య 9వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుమారుడు గడ్డం సిద్ధులు నిరుపేద కుటుంబాలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గడ్డం సిద్ధులు తన తండ్రి గడ్డం మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగ నివాళులర్పించారు. అనంతరం నిరుపేద కుటుంబాలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన తండ్రి మరణించి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన అనిత, కీర్తిశేషులు కమల్, విజయ్ కుటుంబ సభ్యులకు గడ్డం సిద్ధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోభైరి విశ్వనాధం, నీల మురళి, తిప్పారపు రాములు, నల్లగొని శ్రీనివాస్, చిరబోయిన రమేష్, వల్లెపు పరశురాములు, కాటబోయిన రాజు, కుమ్మరిండ్ల శ్రీకాంత్, తాటిపాముల సోమరాజు తదితరులు పాల్గొన్నారు.