విమాన రంగంపై విజ్ఞానం పెంపొందించుకోవాలి

17-09-2026 | 11:22pm

సిఆర్పిఎఫ్ పాఠశాలలో బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్

సిఆర్పిఎఫ్ డీజీ జి.పి. సింగ్                         

జవహర్ నగర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): విమాన రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని బాలికలు విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని సిఆర్పిఎఫ్ డిజి జి.పి. సింగ్(CRPF DG G.P. Singh) పిలుపునిచ్చారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్ అరుంధతి నగర్ సిఆర్పిఎఫ్ క్యాంపస్లో బోయింగ్ ఇండియా సౌత్ ఏషియా అధ్యక్షుడు సలీం గుప్తే ఆధ్వర్యంలో బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్ ను గురువారం సిఆర్పిఎఫ్ సింగ్ సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఆర్పిఎఫ్ డిజి జి.పి సింగ్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు ఆచరణాత్మక ప్రత్యక్ష అభ్యాసంతో సైన్స్ టెక్నాలజీని అందుపుచ్చుకోవచ్చునని బాలికలు ఏవియేషన్లో దూసుకుపోవాలని వారి కోసం ప్రత్యేకంగా 1.25 కోట్ల వరకు స్కాలర్షిప్ సహాయం బోయింగ్ సంస్థ అందించనుందని అన్నారు. మహిళలు నేల నుంచి నింగి వరకు అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. ఆధునిక సాంకేతిక విద్యతోనే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని నూతన ఆవిష్కరణల సృష్టికర్తలుగా విద్యార్థులు సంసిద్ధులు కావాలని పేర్కొన్నారు. బోయింగ్ సుకన్య స్టెమ్ సంస్థ సేవలు అభినందనీయమన్నారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులను  సింగ్ పరిశీలించారు.

మరిన్ని వార్తలు