ఆయన పాదయాత్ర కాదు..ఎన్ని దండాలు పెట్టినా పట్టించుకోరు: కోమటిరెడ్డి

17-09-2026 | 06:25pm

హైదరాబాద్: కేసీఆర్(KCR), కేటీఆర్(KTR)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను అప్పటి సీఎం కేసీఆర్‌ ఏపీకి అప్పగించారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్‌, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి నీళ్లు తరలిపోతున్నాయని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో రూ.111 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.కృష్ణా జలాల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన, ఏపీకి నీటి తరలింపుతో నల్గొండకు అన్యాయం జరుతోందని ఆరోపించారు.

కేటీఆర్‌ పాదయాత్ర కాదు..పొరుగు దండాలు పెట్టినా.. ప్రజలు పట్టించుకోరని విమర్శించారు.అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ పాదయాత్ర చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు పట్టించుకోరని కోమటిరెడ్డి విమర్శించారు.

మరిన్ని వార్తలు