కేసీఆర్ ‘భూబకాసురుడు’
2004వరకు కేసీఆర్ కు ఒక్క ఎకరా భూమి లేదు
హైదరాబాద్: తెలంగాణలో సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ ఆస్తుల పంచాయతీ కొనసాగుతోంది. నిన్న కేసీఆర్ ఆస్తులపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ గురువారం కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.... 2004 వరకు కేసీఆర్ కు ఒక్క ఎకరా భూమి కూడా లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎకరా భూమి లేదని స్వయంగా కేసీఆర్ అఫిడవిట్ లో పేర్కొన్నారని తెలిపారు. నాడు ఎకరా భూమి లేని కేసీఆర్ ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ వేల కోట్ల విలువైన ఆస్తులు సంపాదించిన భూ బకాసురుడని మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read - కేసీఆర్ ఆస్తులపై విచారణకు సిద్ధమా? రేవంత్‌కు KTR సవాల్
కల్వకుంట్ల ముఠా అడ్డంగా బుక్ అయింది: మంత్రి పొంగులేటి
ఎన్నికల అఫిడవిట్ ద్వారా కల్వకుంట్ల ముఠా అడ్డంగా దొరికిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలన పదేళ్ల పాలనలో ఉద్యమకారులకు అప్పులే మిగిలాయని విమర్శించారు. ఉద్యమకారుల ఆస్తులు తగ్గితే.. కేసీఆర్ కు రూ. లక్ష కోట్ల ఆస్తులు వచ్చాయని ఆరోపించారు. భూములు దోచుకోవడం వల్లే కేసీఆర్ కు ఇన్ని ఆస్తులు వచ్చాయి కదా? అని మంత్రి ప్రశ్నించారు. ఉద్యమకారుల త్యాగాల పునాదులపై లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారని తెలిపారు. పుట్టుకతోనే కేసీఆర్ కు వందల ఎకరాలు ఉన్నాయని కేటీఆర్ అంటున్నారన్న పొంగులేటి కేసీఆర్ కు వందల ఎకరాలు ఉంటే ఎన్నికల అఫిడవిట్ లో తప్పులు రాశారా?, లేకుంటే ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారా? అని మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు.