ఫార్మ్ పాండ్స్ తో రైతులకు మేలు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ (విజయక్రాంతి): ఫార్మ్ పాండ్స్ నిర్మాణంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) అన్నారు. మంగళవారం ఘన్ పూర్ (స్టేషన్) మండలం రంగరాయగూడెం గ్రామంలో వీబీజీ రామ్ జీ పథకం కింద చేపట్టిన ఫార్మ్ పాండ్స్ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రైతు ఎల్లగౌడ్ తో మాట్లాడి పాండ్ వల్ల కలిగిన ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. బోరులో నీరు పెరిగిందని, వరి పంట సాగు చేస్తున్నానని రైతు తెలిపారు. ఫార్మ్ పాండ్స్ నిర్మాణం నిబంధనల ప్రకారం చేపట్టాలని, మట్టిని గుంతలకు దూరంగా వేయాలని అధికారులకు సూచించారు. ఉపాధి కల్పనతో పాటు నీటి సంరక్షణకు ఫార్మ్ పాండ్స్ ఎంతో కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, అదనపు డీఆర్డీఓ పి.సూరి, ఎంపీడీవో విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.