దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి

13-10-2026 | 05:51pm

బోధన్ (విజయక్రాంతి): దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్(Bodhan ACP Srinivas) మండప నిర్వాహకులకు సూచించారు. బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం దుర్గామాత నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సార్వజనిక ఉత్సవ కమిటీ పెద్దలు, మండప నిర్వాహకులు, ఏఎస్ఐ చిరంజీవులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు