చివ్వెంలను కరువు మండలంగా ప్రకటించాలి

13-10-2026 | 05:51pm
  1. ఎకరానికి రూ.50 వేల పంట నష్టపరిహారం అందించాలి
  2. గ్రామీణ పేదల సంఘం డిమాండ్

చివ్వెంల, అక్టోబర్ 13 (విజయక్రాంతి): వర్షాభావంతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామీణ పేదల సంఘం(Rural Poor Association) జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య డిమాండ్ చేశారు. మంగళవారం చివ్వెంల మండలంలోని ఎండిపోయిన పంట పొలాలను సంఘం నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా సరైన వర్షాలు లేక చెరువులు, కుంటలు, బోరుబావులు ఎండిపోయి తాగునీరు, సాగునీటి కొరత తీవ్రంగా ఏర్పడిందన్నారు. జూలైలో కురిసిన అరకొర వర్షాలను నమ్ముకుని సాగు చేసిన పత్తి, పెసర, కంది పంటలు వర్షాలు లేక ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం చివ్వెంల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం నాయకులు భాషిపంగు సునీల్, అనంతుల ఎల్లయ్య, అంజయ్య, నారాయణరెడ్డి, షేక్ సైదులు, ధరావత్ వీరన్న, కట్టంగూరు వెంకట నరసరావు, పంతం బ్రహ్మచారి, భూక్య వెంకన్న, భూక్య చక్రం, భూక్య పెద్దవాళ్య, భూక్య చిన్నవాళ్య, సిగ వెంకన్న, చిన్నవాళ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు