కాళేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభం
భూపాలపల్లి/కాళేశ్వరం అక్టోబర్ 26 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అల్పాహార పథకాన్ని(Breakfast Scheme) ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ చెమ్మాల సుధీర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ సుంకరి లక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని తమ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, చదువుపై ఏకాగ్రతను పెంపొందించడం, పాఠశాలకు హాజరును ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ఈ అల్పాహార పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా సర్పంచవ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధితో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దొనికల రాజేందర్, ఉపాధ్యాయ బృందం, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.