స్పందన అనాథ ఆశ్రమానికి ఎంజీఎం విద్యార్థుల విరాళం
19-09-2026 | 09:52pm
గణపురం, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): జమ్మికుంటలో నిర్వహిస్తున్న స్పందన అనాథ ఆశ్రమానికి ఎంజీఎం పాఠశాల విద్యార్థులు (MGM School students) తమ వంతు సహాయంగా విరాళాలు సేకరించారు. ఆశ్రమంలోని అనాథ పిల్లలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో విద్యార్థులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి విరాళాలు సేకరించారు.
విద్యార్థులు సేకరించిన మొత్తం రూ.20,116ను పాఠశాల కరస్పాండెంట్ జి. సతీష్ ఆధ్వర్యంలో ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. చిన్న వయసులోనే సేవా భావాన్ని అలవర్చుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.