Breaking News

గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం

26-09-2026 | 04:08pm

గ్రామ సభల ద్వారా అభివృద్ధి ప్రణాళికలు

భూపాలపల్లి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): గ్రామీణాభివృద్ధి(Rural Development), మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(Gandra Satyanarayana Rao) తెలిపారు. జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల(Department of Rural Development) ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి శనివారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను(Employment guarantee works) విస్తృతంగా చేపట్టడంతో పాటు గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ఎంపిక చేయాలని సూచించారు.

డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులను స్థానిక అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను గ్రామసభల ద్వారా రూపొందించి తీర్మానాలు చేయాలన్నారు. జనాభా ప్రాతిపదికన నిధులు మంజూరయ్యే అవకాశం ఉన్నందున ఆ మేరకు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో నీరు, విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డులు జారీ చేసి ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలని సూచించారు. గ్రామపంచాయతీ, వీఓ భవనాలు, పాఠశాలలకు ప్రహరీలు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, ఫామ్‌పాండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ గ్రామాల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

అక్టోబర్ 2న నిర్వహించే ప్రత్యేక గ్రామసభల్లో గ్రామాభివృద్ధి పనులపై ప్రజలతో చర్చించి తీర్మానాలు ఆమోదించాలన్నారు. ప్రతి గ్రామానికి అవసరమైన పనులపై ముందుగానే జాబితా సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ‘వికసిత్ గ్రామ పంచాయతీ’ ప్రణాళికలను పక్కాగా రూపొందించాలని తెలిపారు.ఈ

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, డీఎంఓ కౌసల్యాదేవి, డీపీఓ శ్రీలత, ఎంపీడీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు