చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి
కామారెడ్డి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): చాకలి ఐలమ్మ(Chakali Ilamma) పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి(Jukanti Prabhakar Reddy) అన్నారు. శనివారం కామారెడ్డి బిఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131 జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, చాకిరి విముక్తి కోసం రజాకారులతో(Razakars), దొరలతో ఎదు రోడి పోరాడి వీరనారీగా పేరు తెచ్చుకుందన్నారు. ఆమె స్ఫూర్తితో ఎంతోమంది తెలంగాణ సాయుధ పోరాటంలో(Telangana Armed Struggle) పాల్గొని తరిమి తరిమి కొట్టారన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని . దోచుకోవాలని చూస్తున్న ఆంధ్ర పాలకులను ఆంధ్ర తత్వైన రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు ను, పవన్ కళ్యాణ్ లను తరిమికొట్టే విధంగా అందరూ సాకలి ఐలమ్మ తెగువను, వీరనారి గా కంకణం కట్టుకొని మన జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, కో ఆప్షన్ కుంభాల రవి యాదవ్, కౌన్సిలర్ ఆఫీస్ బేగ్, మామిళ్ల లక్ష్మణ్, కౌన్సిలర్ మన్సూర్, ఎక్స్ కౌన్సిలర్ అంజన్ రెడ్డి, రామన్న, నరేష్ రెడ్డి, షౌకత్ అలీ, కొత్తింటి శ్రీనివాస్ రెడ్డి,నజీర్, హనుమల్ల రాజనర్సు, వడ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.