విద్యార్థులు పాఠ్యంశాలకే పరిమితం కాకూడదు
- షైన్ పాఠశాల కరెస్పాండెంట్ భానుచందర్
- షైన్ పాఠశాల విద్యార్థులకు 2047 నాటికి భారతదేశం అంశంపై వ్యాసరచన పోటీ
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 29 ( విజయక్రాంతి ) : విద్యార్థులు పాఠ్యంశాలకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్, సామజిక అంశాలు, జాతీయ అభివృద్ధి(National Development) వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక షైన్ పాఠశాల కరెస్పాండెంట్ భానుచందర్ అన్నారు. టాటా ఇండియా బిల్డింగ్(Tata India Building) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలలో భాగముగా గురువారం షైన్ పాఠశాల విద్యార్థులకు 2047 నాటికి భారతదేశం అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు.
ఈ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విద్యారంగంలో సాధించాల్సిన అభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, ఆర్ధిక అభివృద్ధి, యువత పాత్ర వంటి అంశాలపై తమ ఆలోచనలను వ్యాస రూపంలో వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ భానుచందర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే స్ఫూర్తిని నింపుతాయని అన్నారు.