కేంద్రం గుడ్‌న్యూస్.. 5 మెడికల్ కాలేజీలకు నిధులు
29-10-2026 | 04:04pm
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో (PPP) నిర్మించనున్న ఐదు వైద్య కళాశాలలకు రూ.1,091.11 కోట్ల సాధ్యత అంతర నిధుల (VGF) సాయం అందించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పాలకొల్లు, పెనుకొండలో ఈ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి.
ఈ కళాశాలల ఏర్పాటుతో వైద్య, నర్సింగ్ విద్యలో (Medical and Nursing Education) సీట్లు పెరగడంతో పాటు, ప్రత్యేక వైద్య సేవలు (Super Specialty Services) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో వైద్య విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడే వీలుంది.