ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత
ఎమ్మెల్యే బొజ్జు పటేల్
జన్నారం, (విజయక్రాంతి): ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) మొదటి ప్రాధాన్యతనిస్తూ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma Bojju Patel) అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ రైతు వేదికలో లబ్ధిదారులకు మంజూరైన షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాల చెక్కులతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని, ప్రజలు ఇప్పటి నుంచే నీటి సంరక్షణపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించుకొని వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.