మాజీ ఎంపీపీ నారాయణ గౌడ్‌కు ఎమ్మెల్యే పరామర్శ

29-10-2026 | 05:01pm

గణపురం, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం గణపురం మండల కేంద్రానికి వచ్చిన మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్‌ను(Former MPP Vadlakonda Narayana Goud) ఆయన స్వగృహంలో గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) పరామర్శించారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. నారాయణ గౌడ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్  సొసైటీ చైర్మన్ లు గండ్ర సత్యనారాయణ రెడ్డి, కన్నబోయిన కుమార్ యాదవ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు దూడపాక శంకర్ స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

మరిన్ని వార్తలు