కేఎల్లార్ ఫేస్ 1,2,3 లో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు

29-10-2026 | 04:53pm

మేడ్చల్ సర్కిల్ సూపరెండేట్ ఇంజినీర్ జ్ఞానేశ్వర్

మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 29(విజయక్రాంతి):మేడ్చల్ మున్సిపల్(Medchal Municipal) పట్టణంలోని కేఎల్లార్ ఫేస్ 1,2,3 లో విద్యుత్ సరఫరా లోపం కారణంగా కాలని వాసులతో సమావేశం ఏర్పాటు చేసి సబ్ స్టేషన్(Substation) ఏర్పాటు గురించి చర్చించినట్లు టీ.జీ.ఎస్పీ.డి.సి.ఎల్ మేడ్చల్ సర్కిల్ సూపరెండేట్ ఇంజినీర్ జ్ఞానేశ్వర్(Engineer Gnaneshwar) వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎల్లార్ కాలని వాసులకు విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ జాన్ పాల్.అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ రాజమల్లేశం.అసిస్టెంట్ ఇంజినీర్ కె రాంబాబు.

మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్ ముదిరాజ్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం బాల్ రెడ్డి.డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్.మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ యుద్ధండపురం సత్యనారాయణ.చెరువుకొమ్ము శేఖర్ గౌడ్.ఆర్ సంతోష్ గౌడ్.తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు