సిఐటియు నాయకులు రవీందర్ ముందస్తు అరెస్ట్
08-09-2026 | 12:57am
బాన్సువాడ,(విజయ క్రాంతి): ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా బాన్సువాడ పట్టణంలో సిఐటియూ నాయకులు జె రవీందర్ ను సోమవారం సాయంత్రం ఇంటి వద్ద ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరనీ, ప్రజా పాలన అని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతుంది అన్నారు.ఆశ వర్కర్ల సమస్యలపైన చర్చించమంటే అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ప్రభుత్వానికి ప్రశ్నించడం జరిగింది. అసెంబ్లీ సమావేశంలో ఆశ వర్కర్ల సమస్యలు చర్చించి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేనియెడల ఆశ వర్కర్లతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు.
