ఈక్విటీ గ్రాంట్ సర్టిఫికెట్ల పంపిణీ
నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో తాండూర్ కిచ్చన్నపేట ఆధ్వర్యంలో ఎఫ్పిఓ(Farmer Producer Organisation)లో మొదటి విడతగా రూ.2,000 చెల్లించి సభ్యత్వం పొందిన రైతులకు ప్రభుత్వం ద్వారా అందిన ఈక్విటీ గ్రాంట్ సర్టిఫికెట్లను( Equity Grant Certificates) సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ఆకిడి గంగారెడ్డి మాట్లాడుతూ...తాండూర్ కిచ్చన్నపేట ఎఫ్.పి.ఓలో మొత్తం 750 మంది రైతులకు సభ్యత్వం కల్పించే అవకాశం ఉండగా, మొదటి విడతలో 303 మంది రైతులు సభ్యులుగా చేరారని,వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈక్విటీ గ్రాంట్ మంజూరైందని తెలిపారు.
ప్రస్తుతం ఎఫ్.పి.ఓ సభ్యత్వ నమోదు కొనసాగుతోందని, ఇప్పటివరకు మొత్తం 520 మంది రైతులు సభ్యత్వం పొందారని వెల్లడించారు.త్వరలోనే నిర్దేశించిన 750 మంది సభ్యుల లక్ష్యాన్ని చేరుకుని, ఎఫ్.పి.ఓ ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు.సభ్యత్వ లక్ష్యానికి చేరువలో ఉన్నందున, ఎఫ్.పి.ఓలో సభ్యత్వం పొందేందుకు ఆసక్తి ఉన్న రైతులు సంఘ సిబ్బందిని సంప్రదించి సభ్యత్వం పొందాలని అధ్యక్షులు ఆకిడి గంగారెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి,సీఈఓ మురళి, డైరెక్టర్లు వేముల సంగయ్య, హనుమ,కిషన్, విజయకుమార్, సిద్ధిరాంరెడ్డి,నాయకులు ప్రభాకర్,మునిగేపల్లి సంగయ్య,లింగం,అభిషేక్, రాజు,పీర్రెడ్డి,వెంకట్,దివిటీ కిష్టయ్య,సిబ్బంది సాయిలు, రాములు,రైతులు పాల్గొన్నారు.