24 ఏరియా యూపీఎస్‌లో ఉపాధ్యాయులను నియమించాలి
30-09-2026 | 02:35pm
ఇల్లెందు టౌన్, సెప్టెంబర్ 30 విజయక్రాంతి: 24 ఏరియా యూపీఎస్ పాఠశాలలో(UPS School) నెలకొన్న ఉపాధ్యాయుల కొరతను వెంటనే పరిష్కరించాలని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు యు. రామకృష్ణ కోరారు. ఈ మేరకు బుధవారం మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్యాబోధన అందడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల కొరతతో పాఠ్యాంశాల బోధన సక్రమంగా సాగక విద్యార్థుల చదువుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు అవసరమైన ఉపాధ్యాయులను వెంటనే నియమించి విద్యాబోధన సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దామోదర్, నాగేందర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.