బోరుబావుల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం
23-10-2026 | 11:41am
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం(Bhikkanoor Mandal) ఇసన్నపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ బోరుబావుల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణానికి(Soak pit construction) శ్రీకారం చుట్టారు. భూగర్భ జలమట్టం పెంపు, నీటి సంరక్షణ లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మేకల రాములు ఆధ్వర్యంలో ముగ్గు పోసి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజమణి శ్రీనివాస్, కార్యదర్శి సుమ్మెదా రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి, టీఏ స్వప్న, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.