మహనీయుల స్ఫూర్తితో బీసీ రాజ్యం సాధిస్తాం

23-10-2026 | 05:55am

పండుగ సాయన్న ఆదర్శనీయం

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): మహనీయుల స్ఫూర్తితో మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం సాధించడమే ల క్ష్యంగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్(Jajula Srinivas Goud) అన్నారు. పండుగ సాయన్న ముదిరాజ్174వ జయంతి సందర్భంగా గురువారం బీసీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు.

ముందుగా సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆధిపత్య వ్యవస్థపై పోరా డిన పండుగ సాయన్న బీసీలకు ఆదర్శమని కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, చాకలి ఐలమ్మ, కుమ్రం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహనీయుల త్యాగాల స్ఫూర్తితో బీసీలు ఐక్యంగా రాజ్యాధికారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ముదిరాజ్‌లు ఐకమత్యంతో ఇతర బీసీ వర్గాలతో కలిసి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యా మ్ కుర్మా, పిట్ల శ్రీధర్, బి. మణి మంజరి, శివకుమార్, సంధ్యారాణి, శ్రీనివాస్ గౌడ్, వరుణ్ కుమార్, గూడూరు భాస్కర్, బ్రహ్మచారి, బండి గారి రాజు, నాగరాజు, జయరా జు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు