కరెంట్ షాక్ తో మెకానిక్ మృతి

19-09-2026 | 11:29pm

ఉట్నూర్,(విజయక్రాంతి): కరెంట్ షాక్ తో బైక్ మెకానికల్ పవర్ వికాస్ (30) మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంద్రవెల్లి మండలం ఏమాయకుంట గ్రామానికి చెందిన పవర్ వికాస్ ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వాడ్ గావ్ వెళ్లే రోడ్డు సమీపంలోని నెల రోజుల క్రితం  ఒక గదిని అద్దెకి తీసుకొని  బైక్ రిపేర్లు, బైక్ ల ను శుభ్రం చేసే పనులు  చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఐదు గంటల సమయంలో  బైక్ కు వాటర్ వాషింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్  షాక్ తగిలింది.

వెంటనే మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం కోసం తీసుకువెళ్లగా ప్రైవేట్ వైద్యుడు సూచనల మేరకు  జిల్లా కేంద్రంలోని రిమ్స్ రిమ్స్కు ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. ఆసుపత్రికి చేరగానే వైద్యం అందించే లోపు మృతి చెందినట్లు ఏమైకుంట గ్రామస్తులు తెలిపారు. ఆయన మృతితో  గ్రామంలో విషాదఛాయలు  అలుముకున్నాయి. ప్రతి ఒక్కరితో స్నేహభావంగా ఉండే వికాస్  మరణం పట్ల యువకులు ఆందోళనకు గురయ్యారు. కరెంట్ షాక్ తో  మృతి చెందిన విషయం తెలియగానే  సర్పంచ్ జాదవ్ లకన్, బిజెపి నియోజకవర్గ  కో కన్వీనర్  ఆ రెల్లి రాజలింగు, ఆయన స్నేహితులు  రిమ్స్ బయలుదేరి వెళ్లారు.

మరిన్ని వార్తలు