పీహెచ్‌సీని తనిఖీ చేసిన NACO, TG SACS బృందం
భిక్కనూర్, అక్టోబర్ 22 (విజయ క్రాంతి): భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) NACO కన్సల్టెంట్ ఇన్ఫర్మేషన్ డివిజన్ ప్రతినిధి రాజీవ్ రంజన్ తివారి, TG SACS ఏపీడీ డాక్టర్ రాజేశం బృందం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. గర్భిణులకు హెచ్‌ఐవీ (HIV), సిఫిలిస్ పరీక్షలు నిర్వహిస్తున్న విధానం, పాజిటివ్ వచ్చిన వారికి అందిస్తున్న చికిత్స, అవసరమైనప్పుడు ఏఆర్‌టీ (ART) కేంద్రాలకు రిఫర్ చేసే ప్రక్రియను పరిశీలించారు. సంబంధిత రికార్డులను తనిఖీ చేసి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ యేమిమా, డాక్టర్ వనశ్రీ, టీజీ సాక్స్ ప్రతినిధులు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి సిబ్బంది పాల్గొన్నారు.