6 September, 2026 | 12:08 PM

శ్రీ సంత్ సేనా మహారాజ్ పుణ్యతిథిని విజయవంతం చేయండి

06-09-2026 | 11:29am

నాయిబ్రాహ్మణ కుల బంధువులు భారీ సంఖ్యలో తరలిరావాలి...

బాన్సువాడ నాయిబ్రాహ్మణ పట్టణ అధ్యక్షుడు డా. కొత్వాల్ తుకారాం పిలుపు...

బాన్సువాడ, సెప్టెంబర్ 6 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని నాయి బ్రాహ్మణ సంఘంలో(Nayi Brahmana Association) ఈ నెల 8న మంగళవారం ఉదయం 10 గంటలకు నాయిబ్రాహ్మణ కుల గురువు శ్రీ సంత్ సేనా మహారాజ్ పుణ్య తిథి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నాయి బ్రాహ్మణ కుల బంధువులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బాన్సువాడ నాయిబ్రాహ్మణ పట్టణ అధ్యక్షుడు డా. కొత్వాల్ తుకారాం కోరారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్,మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ లతో పాటు,కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్నికి నాయి బ్రాహ్మణులు, కార్యవర్గ సభ్యులు కుల బాంధవులు పెద్ద సంఖ్యల హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు