కొడంగల్‌లో సీఎం దసరా సంబురాలు

23-10-2026 | 05:35am
  1. స్థానిక నాయకులు, ప్రజలతో ఆత్మీయ భేటీ
  2. ఆత్మీయంగా పలకరించిన సీఎం
  3. వేంకటేశ్వర స్వామి ఆలయ పనుల పరిశీలన   
  4. హకింపేట ఎడ్యుకేషన్‌పై ఏరియల్ సర్వే    

కొడంగల్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): విజయదశమిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) గురువారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించారు. కొడంగల్‌లోని తన నివాసంలో స్థాని క ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, ప్రజలు ముఖ్యమంత్రికి దసరా శుభాకాంక్షలు తెలపగా, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

పర్యటనలో భాగంగా కొడంగల్‌లో ’పేదల తిరుపతి’గా ప్రసిద్ధి చెందిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆలయాన్ని అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అంతకుముందు బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం హకింపేట ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని హెలికాప్టర్ ద్వారా గగనతలం నుంచే సమీక్షించారు. ఎడ్యుకేషన్ హబ్ చుట్టూ మూడు రౌండ్లు ఏరియల్ సర్వే నిర్వహించి, పనుల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేసి, ప్రాజెక్టును అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ప్రతి రోజూ పనులను పర్యవేక్షిస్తూ, లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని వారికి సూచించారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధి పనుల పర్యవేక్షణలో ముఖ్యమంత్రి ఏమాత్రం రాజీ పడలేదు.

మరిన్ని వార్తలు