విద్యుత్ కొరత రావద్దు!

23-10-2026 | 05:50am
  1. రోజువారీ ఉత్పత్తిని 140 మిలియన్ యూనిట్లకు పెంచాలి
  2. యాదాద్రి ప్లాంట్‌లో రెండు యూనిట్లకు కోల్ ఇండియా బొగ్గు 
  3. మూతపడిన పరిశ్రమల విద్యుత్ బకాయిల చెల్లింపులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ 
  4. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ కొరత తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, గృహ విద్యుత్ అవసరాల రీత్యా థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని రోజుకు 140 మిలియన్ యూనిట్లకు పెంచాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, బకాయిల అంశాలపై గురువారం సచివాలయంలో వి ద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం రోజువారీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సగటున 91 మిలియన్ యూనిట్లకు చేరిందని, ఇటీవల ఒక్కరోజులో 118 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నమోదైందని అధికారులు వివరించారు. ఈ స్థాయి నుంచి ఉత్పత్తిని మరింత పెంచి రోజుకు 140 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. యాదాద్రి థర్మల్ కేం ద్రంలోని రెండు యూనిట్లకు బొగ్గు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కోల్ ఇండి యా లిమిటెడ్ నుంచి ప్రత్యామ్నాయ బొగ్గు సరఫరా అనుసంధానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బొగ్గు సరఫరా నవం బర్ నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

విద్యుత్ ఉత్పత్తి పెంపులో భాగంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ‘ఈ కేం ద్రంలోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లు ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఐదో యూనిట్‌ను ఈ నెల 20న గ్రిడ్‌కు అనుసంధానించామని, మిగిలిన సాంకేతిక, నిర్వహణపరమైన సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి, ఐదో యూనిటును పూర్తిస్థాయి వాణిజ్య కా ర్యకలాపాల్లోకి తీసుకువస్తున్నామని’ అధికారులు భట్టికి వివరించారు.

‘టీజీజెన్‌కో థర్మ ల్ విద్యుత్ కేంద్రాల రోజువారీ సగటు ఉత్పత్తి 2024- 65.90 మిలియన్ యూనిట్లు, 2025- సుమారు 76. 46 మిలియన్ యూనిట్లు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 21 నాటికి 90.97 మిలియన్ యూనిట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రోజుకు 14.51 మిలియన్ యూనిట్ల మేర, సుమారు 19 శాతం పెరుగుదల నమోదైంది. అక్టోబర్ 16న ఒక్కరోజులో 118 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి’ జరిగిందని అధికారులు తెలిపారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని అన్ని యూనిట్లు గరిష్ఠ సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను పెంచాలని, ఉత్పత్తిని రోజువారీ సమీక్షిస్తూ లక్ష్య సాధన దిశగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని భట్టి ఆదేశించారు.

వన్‌టైమ్ సెటిల్మెంట్.. 

రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలకు విద్యుత్ బకాయిల చెల్లింపుల విషయంలో వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని భట్టి సూచించారు.ఈ విధానం ద్వారా అర్హత కలిగిన పరిశ్రమలకు బకాయిల చెల్లింపుల్లో కొంతమేర వెసులుబాటు లభించడంతో పాటు, విద్యుత్ పంపి ణీ సంస్థలకు దీర్ఘకాలిక బకాయిల వసూళ్లకు అవకాశం కలుగుతుందన్నారు. అలాగే సింగరేణి, జెన్‌కో, ట్రాన్స్‌కో తదితర సంస్థలకు వివిధ విభాగాల నుంచి రావాల్సిన బకాయిల వసూలుకు చర్యలు చేపట్టాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు సూచించారు.

రాష్ట్ర ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీ ఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, జెన్కో సీఎండీ హరీశ్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఆర్పిడిసిఎల్ సీఎండీ ముషారఫ్, సింగరేణి డైరెక్టర్ గౌతం పోట్రు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు