బాల్యవివాహాలపై అవగాహన
మానకొండూరు, నవంబర్ 23 (విజయక్రాంతి): మానకొండూర్ మండలం పోచంపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ లో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల బాల్య వివాహ రహిత భారత్ అవగాహన సదస్సులో బాల్య వివాహాల గురించి సోమవారం అవగాహన సదస్సు(Child Marriage Awareness) నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ కో ,ఆర్డినేటర్ మిరుపూరి వెంకటేష్ మాట్లాడుతూ, 100 రోజుల యాక్షన్ ప్లాన్ బాల్య వివాహ రహిత భారత్ అవగాహన సదస్సులో భాగంగా బాల్య వివాహం, 18 సంవత్సరాల లోపు అమ్మాయి, 21 సంవత్సరాలలోపు అబ్బాయి పెళ్లి చేసుకోవడం నేరమన్నారు. ఒకవేళ ఎవరైనా చేసుకున్నట్లయితే 2 సంవత్సరాలు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానాతో పాటు బాల్యవివాహానికి సహకరించి,పాల్గొన్న వారికి జరిపించిన వారు, శిక్షార్హులవుతారని వివరించారు.
బాలికలు 18 సంవత్సరాలు దాటిన తర్వాత బాలురు 21 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి జరిపించాలని, ఎవరైనా మీ గ్రామంలో బాల్య వివాహాలు జరిపిస్తున్నారని తెలిస్తే 1098 కాల్ చేయాలని మీ వివరాలు గోప్యంగా ఉంటాయని ఆయన వివరించారు. చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ ఆవుల సంపత్ అవగాహన సదస్సులో మాట్లాడుతూ పిల్లలకు నాలుగు రకాల హక్కులు ఉంటాయని అవి జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కుల పై అవగాహన కల్పించారు. పిల్లలు ప్రస్తుత సమాజంలో ఎదుర్కొంటున్న సోషల్ మీడియా సమస్యలు, ఇంస్టాగ్రామ్ ,స్నాప్ చాట్, ఏ విధంగా ఉపయోగించాలి.
పిల్లలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాల గురించి సవివరంగా విద్యార్థులకు వివరించారు. పిల్లలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా 1098 నంబరులో సంప్రదించాలని, బాలికలు ఎటువంటి సామాజిక మాధ్యమాలకు బానిస కావద్దని, ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని చదువుకోవాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమంలో తెలంగాణ మోడల్ స్కూల్ ఇంచార్జ్ డాక్టర్ సుమన్ కుమార్, సోషల్ డిపార్ట్మెంట్, ఉపాధ్యాయులు ఎస్ ఆర్ టి ఆర్గనైజేషన్ కమ్యూనిటీ సోషల్ వర్కర్ కోమల, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.