ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసిన హైడ్రా అధికారులు

23-11-2026 | 08:31pm

ఘట్ కేసర్, నవంబర్ 23 (విజయక్రాంతి): చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా  చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సోమవారం ఘట్ కేసర్ సర్కిల్ పరిధి పోచారం డివిజన్‌ లోని అన్నోజిగూడ మీరాలం కుంటను ఆక్రమణల నుంచి కాపాడేందుకు అధికారులు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. సుమారు 4 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఉన్న కుంట హద్దులను గుర్తించి రక్షణ కంచె నిర్మాణ పనులు చేపట్టారు. మీరాలం కుంటను పరిరక్షించాలని కోరుతూ హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. అందులో భాగంగా హైడ్రా అధికారులు ఫెన్సింగ్‌  వేశారు.

మరిన్ని వార్తలు