ప్రధాన రహదారులు, కాలనీలలో వీధి దీపాలు, ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని వినతి

23-11-2026 | 08:24pm

ఘట్ కేసర్, నవంబర్ 23 (విజయక్రాంతి) : పోచారం డివిజన్(Pocharam Division) పరిధిలోని ప్రధాన రహదారులు, కాలనీలలో వీధి దీపాలు, ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ ఘట్ కేసర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపాగుల వినోద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి కి వినతిపత్రం అందజేశారు. 

నారపల్లి నుండి కొర్రెముల   వరకు, జోడిమెట్ల నుండి చౌదరిగూడ మీదుగా ప్రతాప్‌సింగారం వరకు,  కాచవానిసింగారం వరకు ఉన్న ప్రధాన రహదారులపై వీధి దీపాలు, అవసరమైన వైర్ కేబుల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వెలుతురు సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రజల రాకపోకలకు, రాత్రి వేళల్లో భద్రతకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో మనవి చేశారు.

మరిన్ని వార్తలు