పద్మజ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
23-11-2026 | 04:58pm
అక్రమ అండాల సేకరణ కేసులో డా. పద్మజకు హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ (Anticipatory Bail) పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.బేగంపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన అక్రమ అండాల సేకరణ కేసులో తనను అరెస్ట్ (Arrest) చేయకుండా ముందస్తు బెయిల్ (Bail) మంజూరు చేయాలని కోరుతూ డా. పద్మజ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆమె అభ్యర్థనను తిరస్కరించింది.
దీంతో డా. పద్మజకు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు (High Court) నిర్ణయంతో ఈ కేసులో తదుపరి పోలీసుల చర్యలపై ఉత్కంఠ నెలకొంది.