ఉప్పర్‌పల్లిలో అక్రమ భవనం కూల్చివేత
హైదరాబాద్: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో అక్రమంగా నిర్మించిన రెండంతస్తుల భవనాన్ని కూల్చివేశారు (Demolition). పీఎస్ఆర్ అపార్ట్‌మెంట్స్‌కు చెందిన ఖాళీ స్థలంలో ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ అక్రమ నిర్మాణంపై అపార్ట్‌మెంట్ వాసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన కోర్టు ఆదేశాల మేరకు అధికారులు పలుమార్లు నోటీసులు (Notices) జారీ చేశారు. అయినప్పటికీ నిర్మాణం కొనసాగడంతో కోర్టు ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు.
అనంతరం రెండంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. ఈ చర్యతో ఉప్పర్‌పల్లి ప్రాంతంలో కలకలం నెలకొంది. అపార్ట్‌మెంట్ స్థలంలో అక్రమ నిర్మాణం, కోర్టు ఆదేశాలతో కూల్చివేత జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నగరంలో అక్రమ కట్టడాలపై అధికారుల చర్యలు (Action) మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచాయి.